Thursday, July 26, 2007
తేనె మనసులు--1965 (old)
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల,కృష్ణ
ఆమె::- 1 2 3 4 5 6 7 8 మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
8 7 6 5 4 3 2 1 మానేస్తారా ఇక మానేస్తారా
ఒక ఉద్యోగ మిస్తాను చేస్తారా
ఒక ఉద్యోగ మిస్తాను చేస్తారా
ఆమె::- 1 2 3 4 5 6 7 8 మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
ఉద్యోగ మిస్తాను చేస్తారా
ఒక ఉద్యోగ మిస్తాను చేస్తారా
మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
ఆమె::- ఒళ్ళువంచి పనిచేయాలి
మెదడుకు పదును పెట్టాలి
ఒళ్ళువంచి పనిచేయాలి
మెదడుకు పదును పెట్టాలి
అతడు::-అమ్మయ్యో మెదడే
ఆమె::- అదిలేకున్నా పరవాలేదు
తోడై నేనే ఉంటాను
అతడు::- హమ్మయ్యా..ఉంటారా
ఆమె::- మెలకువగా పని చేసారంటే
మీరే దొరలై పోతారు
1 2 3 4 5 6 7 8 మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
ఉద్యోగ మిస్తాను చేస్తారా
ఒక ఉద్యోగ మిస్తాను చేస్తారా
మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
అతడు::- మరి..జీతం?
ఆమె::- నెలకు ముప్పైరోజులు జీతం
రోజుకు రెండేపూటలు బత్యం
నెలకు ముప్పైరోజులు జీతం
రోజుకు రెండేపూటలు బత్యం
అతడు::- చిత్తం
ఆమె::- పూటపూటకు పనిఉంటుంది
నాలుగురోజులు సెలవుంది
అతడు::-సెలవుల్లో ఏంచేయ్యాలి?
ఆమె::-మా కొలువుననే మీరుండాలి
మా కనుసన్నులలో మెలగాలి
అతడు::-దానికి జీతం?
ఆమె::- నా జీవితం
ఆమె::-1 2 3 4 5 6 7 8 మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
ఉద్యోగ మిస్తాను చేస్తారా
ఒక ఉద్యోగ మిస్తాను చేస్తారా
మాష్టరూ..డ్రిల్‌మాష్టరూ
Labels:
Hero::Krishna,
P.Suseela,
తేనె మనసులు--1965
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment