Thursday, July 26, 2007

తేనె మనసులు--1965 (old)




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

అతడు::-ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు?
ఆమె::-ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

అతడు::- ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు?
ఆమె::- ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

అతడు::- ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
అతడు::- ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము

ఆమె::-అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా

అతడు::-ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఆమె::-ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను


అతడు::-నడవకు నడవకు అమ్మయ్యో..నడిచావంటే అమ్మయ్యో
అతడు::-నడుమే నలిగిపోతుంది..నీ నడుమే నలిగిపోతుంది

ఆమె::- పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు

అతడు::-ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు?
ఆమె::- ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

అతడు::-చూడకు అలా చూడకు..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది..ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది..ఎదలో ప్రేమే పుడుతోంది

ఆమె::-పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నాలాలించేదాన్నీ నేనున్నా
జోజోజో…జోజోజో…

అతడు::- ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు?
ఆమె::- ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

అతడు::-ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఆమె::- ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

No comments: