సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల P. సుశీల
దివినుండి భువికి
దిగివచ్చే దిగివచ్చే
పారిజాతమే నీవై నీవై
గుడిలోని ప్రతిమ
వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి
అందని జాబిలి అందాలు పొందాలి
అనుకున్నానొకనాడు .... ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు
పొందాను ఈనాడు .. ఈనాడు 2
కనరాని దేవుని కనుల చూడాలని
కలగంటి ఒకనాడు ... ఆనాడు
కల నిజము చేసి కౌగిలిలో చేర్చి
కరిగించే ఈనాడు .. ఈనాడు 2
దివినుండి భువికి
కడలిలో పుట్టావు .. అలలపై తేలావు
నురగవై వచ్చావు ఎందుకో
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో 2
ఒరిగి కరగాలనే ఆశతో
దివినుండి భువికి
No comments:
Post a Comment