Tuesday, June 05, 2007

పూలరంగడు--1967::మోహన::రాగ:




సంగీతం::S.రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల


!! రాగ:::మోహన !!


నీవు రావు నిదుర రాదు నిలిచి పోయె యీరేయి
నీవు రావు నిదుర రాదు

తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
చింత చీకటి వొకటై చిన్నబోయె యీ రేయి
నీవు రావు నిదుర రాదు

ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె
నీవు రావు నిదుర రాదు

కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
యెదురు చూసి యెదురు చూసి యెదురు చూసి
యెదురు చూసి కన్నుదోలి అలసిపోయె
నీవు రావు నిదుర రాదు

No comments: