Showing posts with label పూలరంగడు--1967. Show all posts
Showing posts with label పూలరంగడు--1967. Show all posts

Sunday, November 14, 2010

పూల రంగడు--1967




















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల

పల్లవి::

నీ నడుముపైన చేయి వేసి నడువనీ
నన్ను నడువనీ
నీ చేతుల చెరసాలలోన
చేరని..నన్ను చేరనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువనీ
నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగువేసి నడువనీ 
నన్ను నడువని

చరణం::1

చిక్కని బుగ్గలపై చిటికెలు వేయనీ
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే..అలా అలా చూడనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగులేసి నడువని..నన్ను నడువనీ

చరణం::2
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగనీ
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని..నన్ను నడువని

చరణం::3
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ..ఆ...ఆ...ఆ..ఆ...

మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ


Poola Rangadu--1967
Music::S.Rajeswara Rao
Lyricis::C. Narayana Reddy
Singer's::Ghantasala, P.Susheela

Nee nadumu paina cheyi vesi naduvanee
Nannu naduvanee
Nee chetula cherasalalona cheranee
Nannu cheranee

Nee jilugu paita needalona niluvanee
Nannu niluvanee
Nee adugulona adugu vesi naduvanee
Nannu naduvanee

Chikkani buggalapai chitikelu veyanee
Sannani navvulalo sampengaleranee
Gulabi pedavulane ala ala chudanee..

Pachika tinnelalo vechaga kaaganee
Vechani vennelalo muchatalaadanee
Muchatalaadi aadi murisi murisi paadanee.

Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Bangaaru kovelalo kongulu mudi veyanee 

Bangaaru kovelalo kongulu mudi veyanee 

Tuesday, June 05, 2007

పూలరంగడు--1967::మోహన::రాగ:




సంగీతం::S.రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల


!! రాగ:::మోహన !!


నీవు రావు నిదుర రాదు నిలిచి పోయె యీరేయి
నీవు రావు నిదుర రాదు

తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
చింత చీకటి వొకటై చిన్నబోయె యీ రేయి
నీవు రావు నిదుర రాదు

ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె
నీవు రావు నిదుర రాదు

కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
యెదురు చూసి యెదురు చూసి యెదురు చూసి
యెదురు చూసి కన్నుదోలి అలసిపోయె
నీవు రావు నిదుర రాదు

పూల రంగడు--1967::కల్యాణి::రాగం




సంగీతం::S రాజేశ్వర రావ్
రచన::నారాయణ రెడ్డి
గానం::మొహన్`రాజ్,p.సుశీల


!! రాగం: కల్యాణి !!

చిగురులు వేసిన కలలన్ని సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్ని మమతల తీరం చేరినవి
మమతల తీరంచేరినవిఆ.ఆ.ఊఒ.ఊ

సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నను
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నను
నిండు మనసు పందిరి కాగా నిన్నుఅందుకున్నను
నిన్నే అందుకున్నను

!! చిగురులు !!

దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు నీదే నీదే ఈనాడు
నీదే నీదే ఏనాడు

!! చిగురులు !!

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనె....ఆ....
పరిమళాల తరగలలోనె కరిగించిన చెలియవు నీవే 2

!! చిగురులు !!