సంగీతం::శంకర్ జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత
పల్లవి::
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం
చరణం::1
లోకాన పన్నీరు జల్లేవులే..నీకేమొ కన్నీరు మిగిలిందిలే
పెరవారి గాయాలు మాన్చేవులే..నీలోన పెనుగాయ మాయేనులే
నీలోన పెనుగాయ..మాయేనులే
అణగారిపోవు ఆశ..నీవల్లనే ఫలించె
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం
చరణం::2
ఒక కన్ను నవ్వేటి వేళలో..ఒక కన్ను చమరించసాగునా?
ఒకచోట రాగాలు వికసించునా..ఒక చోట హృదయాలు ద్రవియించునా ?
ఒకచోట హృదయాలు ద్రవియించునా?
ఎనలేని ప్రాణదానం..ఎద బాధ తీర్చునా?
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం
చరణం::3
కల్లోల పవనాలు చెలరేగునా..గరళాల జడివాన కురిపించునా
అనుకొని చీకట్లు తెలవారునా..ఆనంద కిరణాలు ఉదయించునా
ఆనంద కిరణాలు ఉదయించునా
విధికేమొ లీల అయినా..మది బరువు మోయునా
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా..సుడిగాలిలోన దీపం
No comments:
Post a Comment