Tuesday, February 10, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా

చరణం::1

కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలో మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా

చరణం::2

చల్ల గాలితో కబురంపితిని 
చల్ల గాలితో కబురంపితిని
చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ
దాగెద వేలా? రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా 

చరణం::3

నల్లని మేఘము జల్లు కురియగా 
నల్లని మేఘము జల్లు కురియగా 
ఘల్లున ఆడే నీలినెమలినై 
నిను గని పరవశమందెద నోయీ
కనికరించి ఇటు రావోయీ

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా

No comments: