సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::M.S.రామారావు
తారాగణం::G.వరలక్ష్మి,రాంగోపాల్,శివరాం,రమణారెడ్డి,లీల,కమల,రాజ్యం,రాజేశ్వరి
పల్లవి::
పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో
ఆవేశాలను ఆశయాలను
వదిన కోసమే వదులుకొంటివా
ఆమెకు నీకు ఋణం తీరెగా
తెగించి చూడు తేలేదేమిటో
బాబూ పో..పోరా బాబూ పో
చరణం::1
ఉన్నవారు కాదన్నావో
ఊరు విడిచి పోతున్నావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏమౌతావో ఎవరికెరుకరా
బాబూ పో..పోరా బాబూ పో
చరణం::2
దూరపు కొండలు నునుపేనేమో
దోషం నీలో లేదో ఏమో
నీవు నమ్మిన నీతి న్యాయం
నీవు నమ్మిన నీతి న్యాయం
నిజమౌనేమో తెలుసుకుందువో
బాబూ పో..పోరా బాబూ పో
చరణం::3
దేశసేవకై దీక్ష పూనమని
ధీరమాత దీవించెను నాన్న
కాకిని కోకిల చేస్తావో
కాకిని కోకిల చేస్తావో
లోకంలో ఒకడైపోతావో
పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో
No comments:
Post a Comment