సంగీతం::పెండ్యాల
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.జానకి
పల్లవి::
కరుణించవే తులసిమాతా..దీవించవే దేవి మనసారా
కరుణించవే తులసిమాతా..దీవించవే దేవి మనసారా
చరణం::1
నిన్నే కోరి పూజించిన సతికీ..కలుగు గాదె సౌభాగ్యములన్నీ
నిన్నే కోరి పూజించిన సతికీ..కలుగు గాదె సౌభాగ్యములన్నీ
కరుణించవే తులసిమాతా..కరుణించవే తులసిమాతా
దీవించవే దేవి మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..తులసిమాతా
చరణం::2
వేలుపురాణి వాడని వయసూ వైభవమంతా నీ మహిమేగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వేలుపురాణి వాడని వయసూ వైభవమంతా నీ మహిమేగా
అతివలలో అతిశయమొందే భోగమందీయవే
కరుణించవే కల్పవల్లి..కరుణించవే కల్పవల్లి
దీవించవే తల్లి..మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..కల్పవల్లి
చరణం::3
నిదురనైన నా నాధుని సేవ..చెదరనీక కాపాడగదే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిదురనైన నా నాధుని సేవ..చెదరనీక కాపాడగదే
కలలనైనా గోపాలుడు నన్నే..వలచురీతి దీవించగదే
కలలనైనా గోపాలుడు నన్నే..వలచురీతి దీవించగదే
కరుణించవే కల్పవల్లి..దీవించవే తులసిమాతా
దీవించవే తల్లి..మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..తులసిమాతా
No comments:
Post a Comment