సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ
దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికీ ఏనాటికీ
తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం
దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం
నిండుగపారే ఏరు తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను తన ఉనికిని తానె చూడదు
పరులకోసం బ్రతికే మనిషి
పరులకోసం బ్రతికే మనిషి
తనుబాగుతానే కోరడు
తనబాగు తానే కోరడు
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం
తాజ్ మహలులో కురిసే వెన్నెల
పూరి గుడిసపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ
పేదముంగిట విరియదా
మంచితనము పంచెవారికీ
మంచితనము పంచెవారికీ
అంతరాలతో పనివుందా
అంతరాలతో పనివుందా
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం
వెలుగున ఉంన్నంతవరకే
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే
అది నీకు దూరమౌతుందీ
ఈ పరమార్థం తెలిసిన నాడే
ఈ పరమార్థం తెలిసిన నాడే
బ్రతుకు సార్థకమౌతుందీ
బ్రతుకు సార్థకమౌతుందీ
దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికీ ఏనాటికీ
తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం
No comments:
Post a Comment