Tuesday, November 22, 2011

వింతకథ--1973


 
సంగీతం::పుహళేంది 
రచన::ఆరుద్ర   
గానం::P.సుశీల   
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

తొలికారు మేఘాలు తొంగిచూశాయి..తొలి ప్రేమరాగాలు పొంగులెత్తాయి
ఈ లోకమే ఉయ్యాల..మనసు ఊగింది కొత్తప్రణయాల
మనకు ఈ లోకమే ఉయ్యాల..మనసు ఊగింది కొత్తప్రణయాల

చరణం::1

నేలను నింగి ముద్దాడుచోట..నేడు పగలే వెన్నెల తోట
నేలను నింగి ముద్దాడుచోట..నేడు పగలే వెన్నెల తోట
విరిబాల పైట చిరుగాలి తొలగించ..విరిబాల పైట చిరుగాలి తొలగించ
పదను తేరింది పరువం..కదను తొక్కింది..కామం
మనకు ఈ లోకమే ఉయ్యాల..మనసు తేలిందిలే వింత భావాలా

చరణం::2

పూచిన పొదల..ఆ..పూచిన పొదల..సారెగదుల
వేచివున్నాయి చిలకలు..మోహాల చిలకలు
పూచిన పొదల సారెగదుల..వేచివున్నాయి చిలకలు
మోహాల...చిలకలు
మరుమల్లె పుప్పొడి..మదనాగ్ని ఎదరేప
మరుమల్లె పుప్పొడి..మదనాగ్ని ఎదరేప
తనరాజు వచ్చాడు వడిగా..కౌగిట చేర్చాడు కసిగా
మనకు ఈ లోకమే ఉయ్యాల..మనసు చేరిందిలే దూర తీరాల    

చరణం::3

లేెచిన కెరటం పడి విరిగింది..లేత వలపుల కల మిగిలింది
లేెచిన కెరటం పడి విరిగింది..లేత వలపుల కల మిగిలింది
అలసిన చెలిమి ఒడిలోన పవళించ..తెలిసిపాడే అనురాగం
బిగియసాగే...అనుబంధం..మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ  

No comments: