Sunday, September 12, 2010

మీనా--1973



















సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Director::Vijayanirmala 
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ


శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా 
శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా 
అయ్యా ఆంధ్రజాతికే..గర్వకారణం రాణీరుద్రమ్మా..తంధానతాన 
పట్టం గట్టుక రుద్రమదేవి..పరిపాలిస్తుంటే..తంధానతాన
మీసంపెంచిన మగరాయుళ్ళే..దాసులు అయినారు..తంధానతాన
కొమ్ములు తిరిగిన మొనగాళ్ళంతా..గులాములయినారు..తంధానతాన 
అయ్యో గిట్టనివాళ్ళు కొందరుమాత్రం కుట్రలు పన్నారు..తంధానతాన 
మురారినాయుడు ద్రోహులలోన ముఖ్యమైనవాడు..తంధానతాన
రుద్రమదేవిని హత్యచేయ ఆ క్షుద్రుడు తలచాడు..తంధానతాన
శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా ఆయ్త రికిట తం చరిత

ఆ క్షుద్రుని తలంపు ఫలించడానిక అన్నట్లు ఆ మొగిలిచర్ల అనే గ్రామంలో ఓహో
ఏకవీర దేవిని సేవించుకొనటానికై ఆహా రుదమదేవి సపరివారంగా వెళ్ళిందయ్యా 
ఆ మట్టున ఎం జరిగింది నాయనా
అదే తరుణమని..మురారినాయుడు ఆలోచించాడు..తంధానతాన 
అరెరె..క్రూర భయంకర ఘోర హంతకుల గుట్టుగపంపాడు..తంధానతాన 
బస్తీకదిలీ పల్లెకువచ్చిన రాణీ రుద్రమకు..తంధానతాన 
అయ్యో పరుగునవచ్చే ప్రమాద ప్రళయం పాపం తెలియదయో..తంధానతాన
పరివారంబున సన్నిధి నుండి పంపివేసినామే..తంధానతాన
చంద్రహాసమే చెంత నుంచుకుని ఒంటిగ నిదురించే 
తంధానా తంధాన ఓ దేవనందనానా..తంధానా తంధాన ఓ దేవనందనానా 
తకట్జంత తకట్జంత తకజనుత తా

కటిక చీకటి కమ్మెరా..సై
కారు మబ్బులే మూసెరా..సై 
శకునపక్షులే కూసెరా..సై
ఆయ్..వల్లకాటి దెయ్యాలురా
వళ్ళు విరిచి మేల్కాంచెరా 
నక్కల పాపిష్ఠి కూతలూ..సై
దిక్కులు పిక్కటిల్లెరా..సై
కెవ్వూ..హోరున గాలులు వీచెరా..సై
గాలికి దివ్వెలు ఆరెరా..సై  
కాళరాత్రి ..గర్జించెరా 
భళానంటి..బాయ్ తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా
భళానంటి బాయ్..తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా
భళానంటి బాయ్..తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా

ఆ భయదబీకర గాడాంధకారంలో అయ్యో ఏం జరిగిందీ 
డెక్కల చప్పుడు దూరంలోన మిక్కుటమైనాయి..తంధానతాన
అంతకంతకూ ఆ సవ్వడులే దగ్గరపడ్డాయి..తంధానతాన
రూపం తెలియని ఆకారాలే దాపురించినాయి  
చీకటిలోన చిక్కటి నీడలు గోడ దూకినాయి
ఖడ్గం దాలిచి రుద్రమదేవి తలుపు తెరిచినాది 
అరెరె..చింతనిప్పులా ఎర్రని కన్నులు ఎదుటనిలిచినాయి
అంతు చిక్కని నల్లని దేహం వింతగ మెరిసింది 
హొయ్..మురారి పంపిన ముష్కరుడప్పుడు కత్తి దూసినాడా..తంధానతాన
హరాం హరా అని ఆడదానిపై వేటు వేసినాడు..ఆ

No comments: