Sunday, March 21, 2010

బావమరదళ్ళు--1960::రాగమాలిక::రాగాలు





















సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ

రాగమాలిక::రాగాలు 

పల్లవి::

కాంభోజి::రాగం

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు
ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

ఎక్కడున్నాగాని..దిక్కువారేకదా
చిక్కులను విడదీసి..దరిజేర్చలేరా
ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::1

యదుకుల కాంభోజి::రాగం

ఆలి ఎడబాటెపుడు..అనుభవించెడువాడు
అలమేలుమంగపతి..అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు..ఎల్లవేల్లలయందు
దోగాడు బాలునికి..తోడునీడౌతాడు

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::2

కానడ::రాగం

నెల్లూరి సీమలో..చల్లంగ శయనించు
శ్రీరంగనాయకా..ఆనందదాయకా
తండ్రి మనసుకు శాంతి..తనయునికి శరణు
దయచేయుమా నీవు..క్షణము ఎడబాయకా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం::3

గౌరీమనోహరి::రాగం

ఎల్లలోకాలకు..తల్లివై నీవుండ
పిల్లవానికి ఇంక..తల్లి ప్రేమా కొరత
బరువాయె బ్రతుకు..చెరువాయె కన్నీరు
బరువాయె బ్రతుకు..చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు..మా కనకదుర్గా..ఆ

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::4

మాయామాళవ గౌళ::రాగం

గోపన్నవలె వగచు..ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి..భద్రాద్రివాసా
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ 
బాధలను తీర్చేటి..భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె..నెరవేరునయ్యా
చిన్నారి బాలునకు..శ్రీ రామ రక్ష

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::5

నాటకురంజి::రాగం

బాల ప్రహ్లాదుని..లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా..వేరు దైవము లేడు
అంతు తెలియగారాని..ఆవేదనలు గలిగే 
అంతు తెలియగారాని..ఆవేదనలు గలిగే  
చింతలను తొలగించు..సింహాచలేశ

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

No comments: