Sunday, March 21, 2010

బావమరదళ్ళు--1960




సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..
పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగి..ఏ..

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..

చరణం::2

వికసించె విరజాజులు..వెదజల్లగ పరిమళాలు
వికసించె విరజాజులు..వెదజల్లగ పరిమళాలు
రవళించె వేణుగీతి..రవళించె వేణుగీతి..రమ్మని పిలువ..ఆ

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..

No comments: