Tuesday, December 27, 2011

గుణవంతుడు--1975























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు , P.సుశీల

పల్లవి::

సీతమ్మ నడిచింది రాముని వెంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా
రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా

అడవంతా పులకరించి పూచెనంట
అడవంతా పులకరించి పూచెనంట
ఆ కుటీరమే వారి ప్రణయలోకమంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా

చరణం::1

కొమ్మ మీది గోరువంక కులుకులాడి చిలుకవంక
కొంటెగా చూసెనంటా..మ్మ్..
కొమ్మ మీది గోరువంక కులుకులాడి చిలుకవంక
కొంటెగా చూసెనంటా

పంచవటి పంచలోని పంచవన్నె రామచిలుక
పైట సర్దుకొన్నదంటా
పంచవటి పంచలోని పంచవన్నె రామచిలుక
పైట సర్దుకొన్నదంటా

పచ్చగడ్డి మేసేటి..పసిడి లేడి మేతమాని
పరుగులే తీసెనంటా..ఆ ఆ
సీతమ్మ చెవిలోనా రాముడేదొ చెప్పగా..ఆహా
సిగ్గుపడి పోయెనంటా 
సీతమ్మ నడిచింది రాముని వెంటా

చరణం::2

పొదరిల్లే సవరించి చిగురుటాకు తలుపుమూసి
తీగలే ఊయలగా ఊగిరంటా
పొదరిల్లే సవరించి చిగురుటాకు తలుపుమూసి
తీగలే ఊయలగా ఊగిరంటా

ఎటు చూసిన జంటలై ఒకే వలపు పంటలై
ౠతువులన్ని ఏకమై వచ్చెనంటా
ఎటు చూసిన జంటలై ఒకే వలపు పంటలై
ౠతువులన్ని ఏకమై వచ్చెనంటా

వెచ్చదనం చల్లదనం..వెచ్చదనం చల్లదనం
పెంచెనంటా..
వెన్నెలతో నీరెండల వియ్యమంటా..ఆ

సీతమ్మ నడిచింది రాముని వెంటా
రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా
అడవంతా పులకరించి పూచెనంట
ఆ కుటీరమే వారి ప్రణయలోకమంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా

Gunavantudu--1975
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Balu , P.Suseela

::;

seetamma naDichindi raamuni venTaa
seetamma naDichindi raamuni venTaa
raamuDu unnaaDu seetamma kanTaa
seetamma naDichindi raamuni venTaa

aDavantaa pulakarinchi poochenanTa
aDavantaa pulakarinchi poochenanTa
aa kuTeeramE vaari praNayalOkamanTaa
seetamma naDichindi raamuni venTaa

:::1

komma meedi gOruvanka kulukulaaDi chilukavanka
konTegaa chUsenanTaa..mm..
komma meedi gOruvanka kulukulaaDi chilukavanka
konTegaa chUsenanTaa

panchavaTi panchalOni panchavanne raamachiluka
paiTa sardukonnadanTaa
panchavaTi panchalOni panchavanne raamachiluka
paiTa sardukonnadanTaa

pachchagaDDi mEsETi..pasiDi lEDi mEtamaani
parugulE teesenanTaa..aa aa
seetamma chevilOnaa raamuDEdo cheppagaa..aahaa
siggupaDi pOyenanTaa 
seetamma naDichindi raamuni venTaa

:::2

podarillE savarinchi chiguruTaaku talupumoosi
teegalE Uyalagaa UgiranTaa
podarillE savarinchi chiguruTaaku talupumoosi
teegalE Uyalagaa UgiranTaa

eTu chUsina janTalai okE valapu panTalai
RUtuvulanni Ekamai vachchenanTaa
eTu chUsina janTalai okE valapu panTalai
RUtuvulanni Ekamai vachchenanTaa

vechchadanam challadanam..vechchadanam challadanam
penchenanTaa..
vennelatO neerenDala viyyamanTaa..aa

seetamma naDichindi raamuni venTaa
raamuDu unnaaDu seetamma kanTaa
aDavantaa pulakarinchi poochenanTa
aa kuTeeramE vaari praNayalOkamanTaa
seetamma naDichindi raamuni venTaa
seetamma naDichindi raamuni venTaa

No comments: