Tuesday, December 27, 2011

బంగారు చెల్లెలు--1979




సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 
చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 
మల్లెపూలు ముసిరినా..పిల్లగాలి విసిరినా
పాతికేళ్ళకొస్తుంది ప్రతిదినం.. 

చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం
చందమమ పొడిచినా..అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం 
చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 

చరణం::1

మాటవినను పొమ్మన్న మనసుల్లో..మాటమాట రమ్మన్న వయసులో
మాటవినను పొమ్మన్న మనసుల్లో..మాటమాట రమ్మన్న వయసులో

ముసిముసి నవ్వులూ విసిరే కవ్వింతలూ..కసికసిగా పెనవేసే కౌగిలింతలో
ముసిముసి నవ్వులూ విసిరే కవ్వింతలూ..కసికసిగా పెనవేసే కౌగిలింతలో

ఒకరికొకరుమందంది వింత జ్వరం..ఆహా..ఒకరికొకరుమందంది వింత జ్వరం
ఇద్దరు ఇచ్చిపుచ్చుకొమ్మంది ఏమి జ్వరం..ఇది ఏమి జ్వరం..మ్మ్..

చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 
మల్లెపూలు ముసిరినా..పిల్లగాలి విసిరినా
పాతికేళ్ళకొస్తుంది ప్రతిదినం.. 
చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 

చరణం::2

మబ్బులెంత కురిసినా తడవదూ..ఆకాస్శం తడవదూ 
మాటలెన్ని చెప్పినా తీరదు..ఆరాటం తీరదు

మబ్బులెంత కురిసినా తడవదూ..ఆకాస్శం తడవదూ 
మాటలెన్ని చెప్పినా తీరదు..ఆరాటం తీరదు

తొలకరి చినుకులే ఏరులైన తీరులో..ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో
తొలకరి చినుకులే ఏరులైన తీరులో..ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో

ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం..ఆహా..ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం
పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం..మన ప్రేమ జ్వరం 

చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం
చందమమ పొడిచినా..అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం 
చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం 
చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం

No comments: