Tuesday, December 27, 2011

రాజా-రమేష్--1977















సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,జగ్గయ్య,కాంచన,విజయలలిత,జయమాలిని,కె.వి.చలం
పల్లవి::

నేలమీద జాబిలీ..నింగిలోని సిరిమల్లీ
నా చెలీ నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలీ 

నేలమీద జాబిలీ..నింగిలోని సిరిమల్లీ
నా చెలీ నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలీ..ఈ..ఈ.. 
నేలమీద జాబిలీ....

చరణం::1

పిలిచెను కౌగిలి రమ్మనీ..ఇమిడిపొమ్మనీ
తెలిసెను పులకరింత ఇమ్మనీ..దోచి ఇమ్మనీ..

మనసుకు వయసువచ్చు తీయనీ రేయినీ
ఆ..ఆ..ఆ..
వయసుకు మతిపోయి పొందనీ హాయినీ

తొలిముద్దు ఇవ్వనీ..మరుముద్దు పొసగనీ
మలిముద్దు ఏదనీ..మైమరచి అడగనీ

నేలమీద జాబిలీ..నింగిలోని సిరిమల్లీ
నా చెలీ..నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలీ..ఈ..ఈ
నేలమీద జాబిలీ

చరణం::2

వెన్నెల తెల్లబోయి తగ్గనీ..తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గుమానీ..మొగ్గనీ..కలలు నెగ్గనీ
తరచిన మల్లెలు పక్కుమనీ..నవ్వనీ..
పగటికి చోటివ్వక ఉండనీ..రాత్రినీ
దీపాలు మలగనీ..ఆ..తాపాలు పెరగనీ..ఆఅ
రేపన్న దానినీ ఈ పూటే చూడనీ

నేలమీద జాబిలీ..నింగిలోని సిరిమల్లీ
నా చెలీ..నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలీ..ఈ..ఈ
నేలమీద జాబిలీ



1 comment:

aisha said...

I enjoyed your post. It’s a lot like college – we should absorb everything we can but ultimately you need to take what you’ve learned and apply it.
Plymouth Neon AC Compressor