Sunday, December 05, 2010

ఋష్య శృంగ--1961


























సంగీతం::టి.వి.రాజు 
రచన::సముద్రాల (జూనియర్ ) 
గానం::ఘంటసాల

పల్లవి::

హే సురేశా! సుఖజీవన దాత!
పయోధర వాహనా! పర్జన్యా!పర్జన్యా!

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::1 

ఘోడు ఘోడు ఘోషించె ప్రజల
గొంతు మీకు వినిపించలేదా
హాహాకారాలాల్లాడే ప్రజలా 
ఆర్తిమీకు కనుపించలేదా
ఓ ఋతుపవనమా నీల జలదమా
కనికరాన ఈధర చరించరే జలాలనించరే
సంకరా నైధరా చరించరే జలాలనించరే 

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::2


బీటలు వారిన హృదయాల
ఆరాటాలు ఆలించవేల..ఆఆ 
కన్నీటి జాలే ప్రవహించునేల
పన్నీటి జల్లై వర్షింపనేల
ఓ వరుణా దేవతా వర్షదేవతా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::3

దళం ధళస్మనోనోజ్ఞ చంచలా ప్రకాశమా
ఫెళఫెళమని గర్జించు ఘనాఘన నిర్ఘోషమా 
జలజలజల గలగలగల గల ఘల్లున వర్షించరే  
ఈ ఇలతనియించగ తరియించగ వర్షించరే
వర్షించరే..వర్షించరే..వర్షించరే..

No comments: