Sunday, December 05, 2010

దేవదాసు--1953











సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల,కె.రాణి  
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు. 

పల్లవి::

చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ 

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే నీ దారె వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె


చరణం::1

మరపురాని బాధకన్నా మధురమే లేదూ
మరపురాని బాధకన్నా మధురమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
అందరాని పొందుకన్నా అందమేలేదు ఆనందమే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ


చరణం::2

వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా కధ తీరిపోయేనా
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేనే

No comments: