Sunday, December 05, 2010

దేవదాసు--1953






సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::జమునారాణి,ఉడుతా సరోజిని
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.  


పల్లవి::

ఓ..దేవదా..ఓ..పార్వతీ..
చదువు ఇదేనా..అయ్యవారూ నిదరోతే 
తమరూ ఇలాగే..దౌడో దౌడా..
ఓ..దేవదా..

ఓ..దేవదా..
చదువు ఇదేనా..అయ్యవారూ నిదరోతే 
తమరూ ఇలాగే..దౌడో దౌడా..
ఓ..దేవదా..



చరణం::1

కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే
కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట
ఓ..పార్వతీ..

చరణం::2 

రెక్కరాని కూనలే..పడితే పాపమే
బడిలో నేర్పినదీ..ఈ చదువేనా
రెక్కరాని కూనలే..పడితే పాపమే
బడిలో నేర్పినదీ..ఈ చదువేనా

బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే 
బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే
ఓ..పిరికి పార్వతీ..

చరణం::3 

తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి
తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ..అన్నా ఊ..అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా
ఆ..అన్నా ఊ..అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా 
రా రా పిరికి పార్వతీ..
పో పో దుడుకు దేవదా..

No comments: