Saturday, November 26, 2011

చూడాలనివుంది--1998




సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::ఉదిత్ నారాయణ్,స్వర్ణలత

పల్లవి::

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాలా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

చరణం::1

గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మా
క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవులించకుంటే నిద్దరౌతుందా
పుట్టి కొట్టే వేళా రైకమ్మో
చట్టి దాచి పెట్టు కోకమ్మో
క్రిష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో
అరె ఆవోరీ భయ్యా బన్‌సి బజావో అరె ఆంధ్రా కన్హయ్యా హాత్ మిలావో

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

చరణం::2

ఓలమ్మో చోళీలో నా సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో పట్టు విడువు ఉంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
అరె ఆయారే నాచ్‌కే ఆంధ్రావాలా అరె గావోరె విందు చిందు డబ్లీ గోల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాలా

No comments: