Saturday, November 26, 2011

రుద్రవీణ--1988::హిందోళం::రాగం






సంగీతం::ఇళయరాజా
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు

రాగం::హిందోళం

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యచ్చనైన ఊసులెన్నొ రెచ్చకొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడిపేలేని సీకటే ఉండిపోనీ
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రావఁచిలకా సద్దుకుపోయే సీకటెనకా

నమ్మకు నమ్మకు ఈ రేయినీ
కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ

వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
ఊ ఊ నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు యేనాటికీ

పక్కవారి గుండెలనిండా..చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా..చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది
నమ్మకు నమ్మకు
అరె..నమ్మకు నమ్మకు
ఆహా..నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ

శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలై….నా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
ఆహా…నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అహ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ

కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ

No comments: