Saturday, November 26, 2011

ఆకలిరాజ్యం--1981



సంగీతం::MS.విశ్వనాధన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల


గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర ప్రాయాన వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

దేశాన్ని దోచేటి ఆసాములున్నారు
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు
మనిషికీ మంచికీ సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహాని కనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు

ఆ..గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల
మోహాన్ని రేపింది రేయి
మన పేగుల్లో వుందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

ఆ..గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

No comments: