Tuesday, September 04, 2007

చిరంజీవులు--1956::రాగం::దేశ్ కార్





గానం::P.లీల
రచన::సముద్రాల
సంగీతం::ఘంటసాల

రాగం::దేశ్ కార్
ఈ రాగాన్ని "దేశ్ కారి" అనికూడా అంటారు
మోహన క్రిందకూడా పేర్కొనబడింది


నటీ,నటులు::N.T.రామారావ్ , జమున , గుమ్మడి , సుర్యకాంతం,పేకాటశివరాం 


1:-తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా

!! తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా !!

2:-కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయ నిదురలేరా

3:-నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
వెన్న తిందువుగాని రారా

!! తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా !!

No comments: