సంగీతం::T.G.లింగప్ప
రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::ఘంటసాల,రేణుక
తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల
రాగం::ద్వజావంతి
ఈ రాగాన్ని "జయ్ జయ్ వంతి" అనికూడా అంటారు
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఓ.. హో.. మాటాడవదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
1:రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే … ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చెయ్యి చేయీ చేరా విడిపోవులే
!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా !!
2:చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
ఆ.హా.. హా…హా… ఆఆఆఆ
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే ..
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటదే…
!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా !!
3:జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళా మరేవేళా మన రోజులే ….
!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదీ బొమ్మా !!
2 comments:
శక్తిగారూ ! ఈ పాట పల్లవిలో ఒక పొరపాటు దొర్లినది. " ఈ మూగచూపేలా ! బావా ! మాటాడగానే రావా ! " అని ఉంది. చివరి పదం "మాటాడగా నేరవా " అని ఉండాలి. సవరిస్తారని ఆశిస్తాను.
సత్యనారాయణ పిస్క.
thanks satyanarayana garu...
Post a Comment