Tuesday, September 04, 2007

చిరంజీవులు--1956::శివరంజని::రాగం









సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది
గానం::ఘంటసాల,P.లీల
శివరంజని::రాగం 

అ::కనుపాప కరవైన కనులెందుకో  
తనవారే పరులైన బ్రతుకెందుకో

కనుపాప కరవైన కనులెందుకో  
తనవారే పరులైన బ్రతుకెందుకో

చరణం::1

ఆ::
విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె కెంధూళి కలిసేందుకే 

విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె కెంధూళి కలిసేందుకే

మనసైన చినదాని..మనసిందుకే..రగిలేందుకే

కనుపాప కరవైన కనులెందుకో  
తనవారే పరులైన బ్రతుకెందుకో

చరణం::2

అ::
అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కథలాయెనా

అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కథలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా
తనువిందుకా

కనుపాప కరవైన కనులెందుకో  
తనవారే పరులైన బ్రతుకెందుకో

ఆ::తనవారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలిసేరులే 

తనవారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలిసేరులే
ఏనాటికైనా నే నీ దానవే – నీదాననే

అ::చిననాటి మన పాట మిగిలేనులే
కలకాలమీగాధ రగిలేనులే
కలకాల మీగాధ రగిలేనులే
రగిలేనులే…

No comments: