Sunday, September 02, 2007

గృహలక్ష్మి--1967::యమున్`కల్యాణి::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీ శ్రీగానం::P. భానుమతి
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,ఎస్.వి.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.
రాగం:::యమున్`కల్యాణి

పల్లవి::

మావారు శ్రీవారు మామంచి వారు
కలనైన క్షణమైన ననువీడలేరు
నను వీడలేరూ....
మావారు శ్రీవారు మామంచి వారు
కలనైన క్షణమైన ననువీడలేరు
నను వీడలేరూ

మావారు శ్రీవారు మామంచివారు 

చరణం::1

ఊహాతరంగాల ఉయ్యాల ఊగే
ఊహాతరంగాల ఉయ్యాల ఊగే
ఊర్వశిని నేనే మేనకను నేనే
స్నేహానురాగాల సెలయేట తేలీ
స్నేహానురాగాల సెలయేట తేలీ
శ్రీవారినలరించు దేవేరినేనే..

మావారు శ్రీవారు మామంచివారు 

చరణం::2

ఆనందలోకాల సయ్యాటలాడే
ఆనందలోకాల సయ్యాటలాడే
ప్రేయసిని నేనే శ్రీమతిని నేనే
మందార మకరంద మాధురులకోరీ
మందార మకరంద మాధురులకోరీ
మన్నార దరిచేరు దొరగారు మీరే


!! మావారు శ్రీవారు మామంచి వారు
కలనైన క్షణమైన ననువీడలేరు
నను వీడలేరూ
మావారు శ్రీవారు మామంచివారూ.... !!

No comments: