Sunday, September 02, 2007

గృహలక్ష్మి--1967



సంగీతం::S.రాజేశ్వర రావు
రచన:: సముద్రాలరాఘవాచార్య(సీనియర్)
గానం::ఘంటసాల,P.భానుమతి

తారాగణం::అక్కినేని,P.భానుమతి,S.V.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::


కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం::1

అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

చరణం::2

విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామవున్నాడు
చందమామవున్నాడు

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

No comments: