Wednesday, September 05, 2007

దాగుడుమూతలు--1964::తిలక్ కామోద్::రాగం



సంగీతం:K.V.మహదేవన్
రచన:దాసరథి
గానం:ఘంటసాల
Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,బి,సరోజినీదేవి,శారద,

రాగం::తిలక్ కామోద్
ఈ రాగాన్ని " నాట " క్రింద కూడా పేర్కొనబడింది


పల్లవి::


గోరంక గూటికే చేరావు చిలకా
గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా

చరణం::1


ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో

!! గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా !!

చరణం::2


నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా

!! గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా !!

No comments: