సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Adoorti Subbaa Rao
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.
పల్లవి::
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్ద
విరిసి విరియని పువ్వే ముద్ద
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్ద
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
చరణం::1
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
చరణం::2
చకచకలాడే పిరుదులు దాటే
జడను జూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే
జడను జూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే
ఎడదను జూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే
ఎడదను జూస్తే ఏదో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ముద్దుకు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
No comments:
Post a Comment