Wednesday, September 05, 2007

దాగుడుమూతలు--1964

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.

పల్లవి::

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం

చరణం::1

మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
ఆ దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు
ఆ దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం

చరణం::2

పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హౄదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు
బుద్ధిని ఇచ్చి హౄదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు
బుద్ధికి హౄదయం లేక హౄదయానికి బుద్ధే రాక
బుద్ధికి హౄదయం లేక హౄదయానికి బుద్ధే రాక
నరుడే ఈలోకం నరకం చేశాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం

చరణం::3

తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లొకం చూసిచూసి నవ్వింది
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా..ఆ....

No comments: