ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::T.చలపతిరావ్
రచన::సినారె
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని
పల్లవి::
ఏపారిజాతమ్ములీయగలనో..సఖీ
గిరి మల్లికలు తప్ప..గరికపూవులు తప్ప
ఏ కానుకలందించగలనో..చెలీ
గుండెలోతుల దాచుకొన్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు..శరదిందు చంద్రికా
శరదిందు చంద్రికా
చరణం::1
నీవు లేని తొలి రాతిరి..నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరిపానుపు..నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు..సిరులెందుకు
తలపెందుకు..తనువెందుకు
నీవు లేక..నేనెందుకు......
నీవు లేక..నేనెందుకు.......
No comments:
Post a Comment