Wednesday, September 19, 2007

ఏకవీర--1969

ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::T.చలపతిరావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T. రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని

పల్లవి::

ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది
ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది
స్నేహంలో రేకులు విరిసీ..చిరునవ్వుల వెలుగు కురిసి
స్నేహంలో రేకులు విరిసీ..చిరునవ్వుల వెలుగు కురిసి
ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది

ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది
ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది
వేకువ ఇక లేదని తెలిసి..చీకటితో చేతులు కలిపి
వేకువ ఇక లేదని తెలిసి..చీకటితో చేతులు కలిపి
ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది

చరణం::1

మంచు తెరలే కరిగిపోగా..మనసు పొరలే విరిసిరాగా
మంచు తెరలే కరిగిపోగా..మనసు పొరలే విరిసిరాగా
చెలిమి పిలుపే చేరుకోగా..చెలియ వలపే నాదికాగా
అనురాగపు మాలికలల్లి..అణువణువున మధువులు చల్లి
అనురాగపు మాలికలల్లి..అణువణువున మధువులు చల్లి
ఒక ఉదయం పిలిచింది..ఒక హృదయం ఎగసింది

చరణం::2

నింగి అంచులు అందలేక..నేలపైన నిలువరాక
నింగి అంచులు అందలేక..నేలపైన నిలువరాక
కన్నె కలలే వెతలు కాగా..ఉన్న రెక్కలు చితికిపోగా
కనిపించని కన్నీట తడిసి..బడబానల మెడలో ముడిచి
కనిపించని కన్నీట తడిసి..బడబానల మెడలో ముడిచి
ఒక ఉదయం ఆగింది..ఒక హృదయం ఆరింది
ఒక ఉదయం ఆగింది..ఒక హృదయం ఆరింది

ఒక దీపం వెలిగిందీ..

No comments: