Monday, September 17, 2007

లవకుశ--1963::శివరంజని::రాగం


సంగీతం::ఘటసాల
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::P.లీల,P.సుశీల
రాగం:::శివరంజని:::

ఓ...ఓ...ఓ...
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో

తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


రాము గని ప్రేమ గొనె రావణు చెల్లీ
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని..ఈ...

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

ఆ ఆ ఆ....నాథా.....ఆ.....
రఘునాథా .....ఆ.....పాహి పాహి.....

పాహి అని అశోకవనిని శోకించే సీతా
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి

అయ్యో..నిజ పైనే అనుమానమా..ఆ..ఆ
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్షా...ఆ..ఆ
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా.....వినుడోయమ్మా

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి

No comments: