Monday, September 17, 2007

లవకుశ--1963::కీరవాణి::రాగం




సంగీతం::ఘటసాల
రచన::
సముద్రాల వెంకటరాఘవాచార్యులు.
గానం::P.లీల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,అంజలీదేవి,కాంతారావు,కన్మాంబ,సూర్యకాంతం,రమణారెడ్డి,
రేలంగి,S.వరలక్ష్మి,నాగయ్య,సంధ్య,ధూళిపాళ

కీరవాణి::రాగం( హిందుస్తానీ కర్నాటక )

ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా!!!

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని

...మంథర మాట విని...

!!వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా!!


అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి

చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని...కూలే భువి పైని....!!

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా!!

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాల వ్రాలి


ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకొన్నది
అడుగులబడి రాఘవా
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది
అడవి అడవి కన్నీరై అరయుచున్న
ది

No comments: