Monday, September 17, 2007

లవకుశ--1963::హిందోళం::రాగం




సంగీతం::ఘటసాల
రచన::సదాశివ బ్రహ్మేంద్ర
గానం::P.లీల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,అంజలీదేవి,కాంతారావు,కన్మాంబ,సూర్యకాంతం,రమణారెడ్డి,
రేలంగి,S.వరలక్ష్మి,నాగయ్య,సంధ్య,ధూళి
:::: రాగం:::హిందోళం ::::

రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా


అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్యా..సుమిత్రా..కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు..ఉ...
రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు...ఆ..ఆ..

రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా

ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని..నీ..
రామకథను వినరయ్యా

తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి

రామకథను వినరయ్యా
మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినది

రామకథను వినరయ్యా

హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల ..ఆ..ఆ..ఆ....
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కన్నులు కరములు కలిపినవి

రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా

No comments: