Wednesday, August 22, 2007

తోడి కోడళ్ళు--1957

సంగీతం::మాష్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::ఘటసాల,P.సుశీల

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే

నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది …

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే

చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది
నునుసిగ్గుముంచుకొస్తున్నది....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే

తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి
ఆహ తికమక చేస్తు ఉన్నవి ....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి

పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది …ఆఆఆఆఆఆ…ఆఆఆఆఆఆఆ

No comments: