Wednesday, June 06, 2007

మల్లేశ్వరి--1951::కల్యాణి::రాగం


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
డైరెక్టర్::BN.రెడ్డి
గానం::భానుమతి


రాగం::కల్యాణి !! 

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

No comments: