Wednesday, June 06, 2007

మల్లేశ్వరి--1951::కానడ::రాగం



సంగీతం::సాలూరు
రచన::దేవునిపల్లి క్రిష్ణ శాస్త్రి

గానం::భానుమతి

కానడ::రాగం
(హిందుస్తానీ ~ కర్నాటక)


ఎవరు ఏమని విందురు
ఎవ్వరేమని కందురు
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెల రాజా
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా

ఏనాడో ఏకమై కలసిపోయిన జంట
ఏ కౄరదైవము ఎడబాటు చేసెనే ఏ ఏ
ఊరు గుడిలో రావి బావల
నాటి వలపుల మాటలన్ని
నేలపాలై పోయెనే ఏ ఏ
గాలిమేడలు కూలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా

ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా ఆ ఆ
ఆనాటి బాసలు అన్ని కలలాయెనే ఏ ఏ ఏ
నడిచి వచ్చే వేళ తెలవని అడుగనైనా అడుగలేదని

ఎంతగా చింతించెనో ఏమనుచు దు:ఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే
తుదకు భాదలు మిగెలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఆ ఆ ఆ
నెలరాజా వెన్నెల రా
జా

No comments: