సంగీతం::S.రాజేశ్వరరావ్ రచన::ఆరుద్ర గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య. :::::: సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు చిన్నారి పాపా నవ్వులూ..మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు..బంగారు జ్యోతుల దీవెనలు సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు చిన్నారి పాపా నవ్వులు మా ఇంటి వెలుగు..మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు...
:::::1 పాపయి గెంతులు..తువ్వాయి చెంగులు పాపయి గెంతులు..తువ్వాయి చెంగులు తూనీగ లాగా దొరకదు పరుగులు తీసె పండుగ..ఉరకలు వేసే వేడుక మా జ్యోతి చిందులే అందాల విందులు
::::2 తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను ఆడిన ఆట...పాడిన పాట ఆడిన ఆట అల్లరి..పాడిన పాట పల్లవి మా జ్యోతి మాటలే వరహాల మూటలు..
:::::3 ఆ కొంటె చేష్టలు..ఆ చిలిపి చూపులు ఆ కొంటె చేష్టలు..ఆ చిలిపి చూపులు ఆనందమొసగే వరములు ఇరుగు పొరుగు మెచ్చగా..ఇంటీలిపాదికి నచ్చగా చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా..
సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు చిన్నారి పాపా నవ్వులు మా ఇంటి వెలుగు..మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు... Amayakuralu--1971 Music::Saluri Rajeswara Rao Lyricis::C Narayana Reddy Singer's::S.P.Balu, P.Susheela ::: sannajaji puvvulu chandamama kantulu chinnari papa navvulu ma inti velugu ma kanti velugu bangaaru jotula deevenalu angaaru jotula deevenalu :::1 papayi gentulu tuvvayi chengulu papayi gentulu tuvvayi chengulu tureegalaaga dorakadu parugulu teeste panduga urakalu veste veduka ma joti chindule andaala vindulu :::2 tatayya meesala uyyalalugenu ammamma kallato dobuchulaadenu tatayya meesala uyyalalugenu ammamma kallato dobuchulaadenu aadina aata padina paata aadina aata allari padina paata pallavi ma joti matale varahala mutalu :::3 aa konte chestalu aa chilipi chupulu anandamosage varamulu iruguporugu mechaga intillipadiki nachaga
:::: అతడు::నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో..అ చూపులలో.. నిను కవ్వించే వాడెవ్వడూ
ఆమె::నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచిన ఏ ఒక్కరికో అవి దక్కును లే..ఆ టక్కరి దొంగవు నీవేలే
::::::1 అతడు::నీ మోమే ఒక చంద్రబింబం దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం నీ మోమె ఒక చంద్రబింబం ఆ అందం చూసి..నీ ముందుకు దూకి ఆ అందం చూసి..నీ ముందుకు దూకి ఎందరు యువకులు తొందరపడి నిను ఎత్తుకు పోతారో నేనేమైపోతానో... ఆమె::అహహహహా...
ఆమె::నా చూపులు గారడి చెసినా నా నవ్వులు పూలై పూచిన ఏ ఒక్కరికో అవి దక్కును లే...ఆ టక్కరి దొంగవు నీవేలే
:::::::2 ఆమె::మగసరి గల సొగసైన దొరవు అందుకు సరిపడు సిరులెన్నొ కలవు మగసరి గల సొగసైన దొరవు నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ చక్కని పడుచుల చెక్కిలి తళుకుల చిక్కుకుపోతావో నేనేమై పోతానో..నీ చెలిని మరిచేవో హూ..ఉహుహుహుహు..
అతడు::నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో..అ చూపులలో..నిను కవ్వించే వాడెవ్వడూ
ఆమె::చిగురించిన ఈ అనురాగం వికసించునులే కలకాలం చిగురించిన ఈ అనురాగం
చిరునవ్వుల కులికే రాజా..సిగ్గంతా ఒలికే రాణీ సరి జోడు కుదిరింది లే..ఏ.. సరదాలకు లోటే లేదు లే..
:::2 అంతస్థులు చూడకుండా..ఐశ్వర్యం ఎంచకుండా.. అంతస్థులు చూడకుండా..ఐశ్వర్యం ఎంచకుండా చక్కనైన నడవడి చూసీ..చల్లని మనసిచ్చాడమ్మా.. అజం తోటి నడిచావంటే..చులకనగా చూసావంటే మడత చపాతీలు వేసీ..బడిత పూజ చేస్తాడమ్మా..
చిరునవ్వుల కులికే రాజా...సిగ్గంతా ఒలికే రాణీ సరి జోడు కుదిరింది లే..ఏ.. సరదాలకు లోటే లేదు లే..
:::3
మా కష్టం తెలిసిన బాబు..నీ జతగాడైనాడమ్మా.. చిలికా గొరింకల్లాగా కిల కిలమని కులకండమ్మా సరసాల్లో గుమ్మైపోయీ..జలసాల్లో చిత్తైపోయీ మమ్ము కాస్త మరిచారంటే దుమ్ము దులిపి వేస్తామయ్యో
అతడు::మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే ఆమె::అనురాగ గీతాల సుమమాల లల్లి అనుబంధ గంధాలు మన మీద చల్లి దేవతలే దీవించువేళ
అతడు::మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే చరణం::1 అతడు::చిగురుటాకుల పందిరిలోన చిలకపాప పేరంటంలో కోయిలమ్మ మేళంపెట్టి కొంగు కొంగు ముడిపడుతుంటె
ఆమె::ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో ఆశీర్వదించేనులే ఈ వసంతం ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో ఆశీర్వదించేనులే ఈ వసంతం ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం ఇకమనకు సొంతం అతడు::మనసంతా మంగళవాద్యాలే ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
చరణం::2 ఆమె::కలలు పండి గెలలేస్తుంటే కళ్లు నన్ను నిలవేస్తుంటే ఇద్దరొకటై గదిలొ..చేరి నిద్దర కోసం వెతుకుతు వుంటె
అతడు::ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముద్దుమురిపాల మధురాక్షరాలు ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముద్దుమురిపాల మధురాక్షరాలు ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు..ఎన్నోవరాలు ఆమె::మనసంతా మంగళవాద్యాలే ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే అతడు::మనసంతా మంగళవాద్యాలే అతడు::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
బస్కీల వీర కుస్తీ కుమారా ఉంగ ఉంగ ఉగ్గుపడతావేరా సాములేల నా సామి రారా టింగురంగా సిగ్గుపడతావేరా గిల్లి జోలల్లు నే పాడనా.. తల్లి ముద్దుల్లోనే ముంచినా కోపమొచ్చినా.. తాపమొచ్చినా..ధూపమెయ్యనా జిడ్డునాయనా బొడ్డుకోయనా పేరు పెట్టనా నిద్దరోమ్మా..నిద్దరోమ్మా.
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ అతడు::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అతడు::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది మనసుంటె వచ్చి వాలు నాపక్కన..ఆ ఆ
ఆమె::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన పలకరింత కలిసింది పులకరింత తెలిసింది మనసుంటె వచ్చివాలు నా పక్కన
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ నువ్వే నాకు సాక్షీ.. కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
చరణం::1 కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది పేగును తెంచిన అదే త్యాగం పేమను తుంచిందా అది అంతరాత్మనే నులిమేసిందా ఇక సత్యమన్నదే కరువవుతుందా ఇక సత్యమన్నదే కరువవుతుందా
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
చరణం::2
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డకు ఇది అగ్నిపరిక్ష ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు గుడిలోని తండ్రే మనకు తీర్పు
సంగీతం::ఘంటసాల రచన::D.C.నారాయణ రెడ్డి గానం::ఘంటసాల సినిమా దర్శకత్వం::K.బాబురావు తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని, భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు భలే మంచిరోజు..పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు ఆ హహహా ఆ హహహా..
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అయ్యయ్యైన జేజైనా అమ్మ పిమ్మటే అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
చరణం::1
బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినా పొంగిపోవు కడుపు తీపి అమ్మది కుసిలి కుసిలి పాలకై..కుసిలి కుసిలి పాలకై గుండెమీద గుద్దినా..మురిసిపోవు వెన్న మనసు అమ్మది మురిసిపోవు వెన్న మనసు అమ్మది అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
చరణం::2
గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది లాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుంది ఆ రామునికి అమ్మకంటే రక్ష ఏమి ఉన్నదీ? అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అమ్మవుంటే లేనిదేమి లేనే లేదూ అమ్మ లేక ఏమున్నా ఉన్నదికాదూ అమ్మంటే త్యాగమూ..అమ్మే ఒక యోగమూ అమ్మంటే సత్యమూ..అమ్మే సర్వస్వమూ అమ్మా..ఆ..అమ్మా..ఆ..అమ్మా...