Tuesday, April 12, 2011

ఇంటిగౌరవం--1970



సంగీతం::కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Baapu
తారాగణం::శోభన్‌బాబు,నాగభూషణం,చంద్రమోహన్,అరుణ,జానకి.

పల్లవి::

రాణి..ఈఈఈఈఈఈఈ 
చింతపువ్వు ఎరుపు..చిలకముక్కు ఎరుపు
చింతపువ్వు ఎరుపు..చిలకముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు..లేత వలపు తెలుపు
రాణి..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..రాణి..ఈ

మల్లెమొగ్గ తెలుపు..మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు..మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు..నిండు వలపు నిలుపు
రాజా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..రాజా..ఆ

చరణం::1

అబ్బ..ఊరించు పెదవులు ఎరుపు..మ్మ్ హూ 
అవి నాలోన..ఆశలు రేపు...మ్మ్ హూ 
అబ్బ..ఊరించు పెదవులు..ఎరుపు
అవి నాలోన..ఆశలు రేపు
ఆగాలి పెళ్ళైన వరకు..ఆపైన తమదే గెలుపు
వలచే వేళా..తొలగేవేలా?వలచే వేళా..తొలగేవేలా?
వలచే వేళా..తొలగేవేలా?వలచే వేళా..తొలగేవేలా?
ఈ ఎడమోము..పెడమోము రుచి చూడు పులుపు

మల్లెమొగ్గ తెలుపు..మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు..లేత వలపు తెలుపు..
రాణి..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..రాణి..ఈ

చరణం::2

అబ్బ..నీ చేయి చిదిమిన చోట..మ్మ్ హూ
అయ్యో నా బుగ్గ కందేను చూడు..ఆహా
అబ్బ..నీ చేయి చిదిమిన చోట
అయ్యో..నా బుగ్గ కందేను చూడు
నీ నవ్వు వెలిగిన పూటా..నా మేను పొంగేను చూడు 
నీలో నాలో..ఒకటే ఆశా..నీలో నాలో..ఒకటే ఆశా
అది పండేను మురిపాలు..నిండెను రేపు

మల్లెమొగ్గ తెలుపు..మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు..మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు..లేత వలపు తెలుపు..
రాణి..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..రాణి..ఈఈఈ 

Inti Gouvaram--1970
Music::Kodandapaani
Lyrics::Arudra
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Baapu
Cast::Sobhanbaabu,Naagabhooshanam,Chandramohan,Jaanaki,Aruna.

::::::::::::::::::::::::::::::::::

raaNi..iiiiiiiiiiiiii 
chintapuvvu erupu..chilakamukku erupu
chintapuvvu erupu..chilakamukku erupu
chEyi chEyi kalupu..lEta valapu telupu
raaNi..ii..ii..ii..ii..ii..raaNi..ii

mallemogga telupu..manchi manasu telupu
mallemogga telupu..manchi manasu telupu
chEyi chEyi kalupu..ninDu valapu nilupu
raajaa..aa..aa..aa..aa..aa..O..raajaa..aa

::::1

abba..Urinchu pedavulu erupu..mm huu 
avi naalOna..aaSalu rEpu...mm huu 
abba..Urinchu pedavulu..erupu
avi naalOna..aaSalu rEpu
aagaali peLLaina varaku..aapaina tamadE gelupu
valachE vELaa..tolagEvElaa?valachE vELaa..tolagEvElaa?
valachE vELaa..tolagEvElaa?valachE vELaa..tolagEvElaa?
ii eDamOmu..peDamOmu ruchi chooDu pulupu

mallemogga telupu..manchi manasu telupu
chEyi chEyi kalupu..lEta valapu telupu..
raaNi..ii..ii..ii..ii..ii..raaNi..ii

::::2

abba..nee chEyi chidimina chOTa..mm huu
ayyO naa bugga kandEnu chooDu..aahaa
abba..nee chEyi chidimina chOTa
ayyO..naa bugga kandEnu chooDu
nee navvu veligina pooTaa..naa mEnu pongEnu chooDu 
neelO naalO..okaTE aaSaa..neelO naalO..okaTE aaSaa
adi panDEnu muripaalu..ninDenu rEpu

mallemogga telupu..manchi manasu telupu
mallemogga telupu..manchi manasu telupu
chEyi chEyi kalupu..lEta valapu telupu..
raaNi..ii..ii..ii..ii..ii..raaNi..iiiiii 

తోబుట్టువులు--1963





















సంగీతం::C.మోహన్ దాస్
రచన::అనిసెట్టి
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::C.V.Ranganath Das
తారాగణం::కాంతారావు,జగ్గయ్య,S.V.రంగారావు,సావిత్రి,జమున.

:::::::::::::::::::::::::

మధురమైన రేయిలో మరపురాని హాయిలో
పండువెన్నెలే నేడు పాడెనేలనో

మధురమైన రేయిలో మరపురాని హాయిలో
పండువెన్నెలే నేడు పాడెనేలనో..

తళుకు తళుకు తారలె అద్దాల నీట వూగెలె
తళుకు తళుకు తారలె అద్దాల నీట వూగెలె
కలలరాణి జాబిలి నా కన్నులందు దాగెలె

పండువెన్నెలే నేడు పాడెనేలనో
మధురమైన రేయిలో మరపురాని హాయిలో
పండువెన్నెలే నేడు పాడెనేలనో..

చిలిపి చిలిపి నవ్వులె చిందించెనేల పూవులే
చిలిపి చిలిపి నవ్వులె చిందించెనేల పూవులే
ఆశమీర హృదయమే ఆనంద నాట్య మాడెలే

మధురమైన రేయిలో మరపురాని హాయిలో
పండువెన్నెలే నేడు పాడెనేలనో.

తోబుట్టువులు --1963::కల్యాణి::రాగం






















సంగీతం::C.మోహన్ దాస్
రచన::అనిసెట్టి
గానం::ఘంటసాల,P.సుశీల

రాగం::కల్యాణి:::
తారాగణం::కాంతారావు, జగ్గయ్య, సావిత్రి, జమున, శారద, ఎస్.వి.రంగారావు 

మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్

సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా..
దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే..
సాగేను జీవితనావ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

మనసంత నీకు మందిరముగా
మమతలే పూమాలగా..
మనసంత నీకు మందిరముగా
మమతలే..పూమాలగా
కానుకగా..అర్పించలేనా..
కానుకగా..అర్పించలేనా
కలకాలం..పూజించనా..

సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా..
దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే..
సాగేను జీవితనావ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కనులార నిన్ను గాంచినంత
కలలన్ని సత్యమౌనులే..
కనులార నిన్ను గాంచినంత
కలలన్ని సత్యమౌనులే
కనికరమే..నా ఫైన రాదా..
కనికరమే..నా ఫైన రాదా
నా తపస్సే ఫలించగా..

సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా..
దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే..
సాగేను జీవితనావ..
ఆ..ఆ...అ.అ..ఆ...ఆ...ఆ..ఆ..ఆ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..

గాలిమేడలు--1962





సంగీతం::T.G.లింగప్ప
రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::రేణుక

తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

కృష్ణా..ఆ..కృష్ణా..ఆఆఆ
మంచిమాటేరా..మంచిమాటేరా..రారా
మంచిమాటేరా..
చెలియమనసు తెలుసుకోరా..
చెలియమనసు తెలుసుకోరా..
పిలుపువినరారా.....
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా..ఆఆ
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా
అలుకఏలా..పలుకవేలా..అలుకఏలా..పలుకవేలా
పిలుపు వినరారా.....ఆ...
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా..ఆ..
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా
నీదుతలపే..మధురబాధై..మదినితలెచెనురా..ఆ
నీవులేకా..నిలువలేను..పిలుపు వినరారా..ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

గాలిమేడలు--1962



సంగీతం::T.G.లింగప్ప
రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::ఘంటసాల

తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

::::::

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో

::::1

ఏ కులమైనా నెలవేది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
ఏ కులమైనా నెలవేది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
పిలిచి లాలించి కొడుకు తందాన
పిలిచి లాలించి కొడుకు తందాన
చూచి కాచే దాటే నాయన కాదా

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో...

::::2

మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
దేవుని సంద్రాన తలచి పూజించి
దేవుని సంద్రాన తలచి పూజించి
కొలువుచేసేవాడే కొడుకవుగాదా

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో...
ఆఆఆఆఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Monday, April 11, 2011

రహస్య గూఢాచారి--1981



సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,షవుకారుజానకి, 

పల్లవి::

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కలిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో....వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చరణం::1

మబ్బులు ముసిరే..ఏ..మనసులలో
మెరుపై మెరిసే సొగసులలో

వలపే తెలిపే పిలుపులలో
ఉరిమై ఉరిమే వయసులలో

కాముడి గుప్పిటిలోనా
కౌగిలి దుప్పటిలోనా
ఈ ముడి ఎప్పటికైనా 
తప్పదు ఎవ్వరికైనా

కాముడి గుప్పిటిలోనా..ఆ
కౌగిలి దుప్పటిలోనా..ఆ
ఈ ముడి ఎప్పటికైనా..ఆ
తప్పదు ఎవ్వరికైనా..ఆ

చినుకు వణుకు చిచ్చులురేపే 
వెచ్చటి ముచ్చటలోనా..ఆ

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చరణం:::2

ఎదలో రగిలే..ఎండలలో
మెదిలే వేసవి తపనలు

ఎదలే వెలిగే..కన్నులలో
మెరిసే కాటుక కవితలలో
ఇద్దరి ముద్దులలోనా
తిలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ
తప్పదులే..దేవుడికైనా

ఇద్దరి ముద్దులలోనా
తిలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ
తప్పదులే..దేవుడికైనా

చిటుకు చిటుకు తాళాలేసే
చిత్తడి జల్లులలో

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

Rahasya Gudhaachaari--1981
Music::ChallaPalli Satyam
Lyrics::?
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Krishna,Jayaprada.

:::

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kalisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO....valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

:::1

mabbulu musirE..E..manasulalO
merupai merisE sogasulalO

valapE telipE pilupulalO
urimai urimE vayasulalO

kaamuDi guppiTilOnaa
kougili duppaTilOnaa
ii muDi eppaTikainaa 
tappadu evvarikainaa

kaamuDi guppiTilOnaa..aa
kougili duppaTilOnaa..aa
ii muDi eppaTikainaa..aa
tappadu evvarikainaa..aa

chinuku vaNuku chichchulurEpE 
vechchaTi muchchaTalOnaa..aa

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

::::2

edalO ragilE..enDalalO
medilE vEsavi tapanalu

edalE veligE..kannulalO
merisE kaaTuka kavitalalO
iddari muddulalOnaa
tilakari valapula vaanaa
endaru Emanu konnaa..aa
tappadulE..dEvuDikainaa

iddari muddulalOnaa
tilakari valapula vaanaa
endaru Emanu konnaa..aa
tappadulE..dEvuDikainaa

chiTuku chiTuku taaLaalEsE
chittaDi jallulalO

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

కానిస్టేబులు కూతురు --1963







సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్,P.సుశీల


చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా
గత కాలపు కథలన్నీ..కన్నీటిలో కరిగేనా..ఆఆఆ
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా

నా ఆశలు పూవులవే..పెను ధూళిలో కలిసేనా
నా ఆశలు పూవులవే..పెను ధూళిలో కలిసేనా
అనురాగపు హారతులే..చితులై దహించేనా..ఆఆఆ

చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా
విధియే మా కెదురైనా..వెతలే ఇక మిగిలేనా
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా

సుకుమారులకీ ఇలలో..సౌఖ్యమ్మే కరువౌనా
సుకుమారులకీ ఇలలో..సౌఖ్యమ్మే కరువౌనా
మా చెల్లెలి జీవితమే..శోకమ్మున మునిగేనా..ఆఆఆ
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా
విధియే మా కెదురైనా..వెతలే ఇక మిగిలేనా..ఆఆఆ

కానిస్టేబులు కూతురు --1963





సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్,P.సుశీల


వగల చూపులేలా..వేచితి జవరాలా
పరువాల సోయగాల..పరవశమ్ము చేయవా!2
మనసులోని కోరికలు..మరులుగొన్న వేళలు
తరిగిపోవనీ అలలపై..మనము తేలిపోదామా
యవ్వనమె పూలవనం..నవ్వులతో జీవనం
వలపు వూయలా వూగగా చేర రావేలా

మరల మరల రాదంటూ..మనదే యీ సుఖమంటూ
మరల మరల రాదంటూ..మనదే యీ జగమంటూ
హాయిగా తీయగా కలసి సాగిపోదామా!
ఆహా..హా హా హా హా హా హా హా

కానిస్టేబులు కూతురు --1963







సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్


వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది
కన్నుల కేలా నాపై కోపం..కణకణలాడినవి
నీ..చూపుల కేలా నాపై కోపం..తూపులు దూసినవి

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
నీ వలపులు చిందే పలుకుల విందే..చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళి దినాన మాటలు కరువైనా..
నన్ను ఓరచూపుల కోరికలూర చూడవ నీవైనా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా ఓఓఓ
మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,S.జానకి


కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

తీయని వలపు ఎందులకు..తీరని వగపై కుండుటకు
మాయని మమతలు ఎందులకు..మదిలో జ్వాలై రగులుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

కమ్మని మాటలు ఎందులకు..కల్లాకపటం దాచుటకు
కన్నియ కలలు ఎందులకు..కలవారికి బలిచేయుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

పూవున తేనియ ఎందులకు..తేపికి విందులు చేయుటకు
తేపికి రెక్కలు ఎందులకు..పూవును మోసం చేయుటకు

కళ్ళల్లో నీరెందులకు.హోయ్...కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..హోయ్..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..హోయ్..కలకాలం విలపించుటకు