Sunday, July 20, 2014

కదలడు-వదలడు--1969

సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి 
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం::B విఠలాచార్య
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయలలిత,రామకృష్ణ,విజయలలిత

పల్లవి::

కట్టు కట్టు గళ్ళచీర..పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు 
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్కో చుట్కో..పట్టుపాగ..పట్కో పట్కో..పూలదండ  
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం::1

నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు

చేతులు చేతులు కలిపి..పోదామా పోదామా
చెక్కిలి చెక్కిలి కలిపి..ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా

చుట్టుకో చుట్టుకో..పట్టుపాగ..పట్టుకో పట్టుకో..పూలదండ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం::2

ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా
ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా

చుక్కల పల్లకి తెస్తా..భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా..ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ

No comments: