Wednesday, May 25, 2011

ఆపద్బాంధవుడు--1992



సంగీతం::M.M.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు, K.S.చిత్ర, కోరస్

పల్లవి::

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా
ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల
ఔరా అవ్ముక చెల్లా ఆలకించి నవ్ముడమెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల
బాపురే బ్రహ్మకు చెల్లా వైనవుంత వల్లించవల్లా
రేపల్లే వాడల్లో ఆనంద లీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల

చరణం::1

నల్లరాతి కండలతో..కరుకైనవాడే
వెన్నెముద్ద గుండెలతో..కరుణించుతోడె
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనంద లాల
వెన్నెముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనంద లీల
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనంద లాల
జాన జాన పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనంద లీల
ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లే వాడల్లో ఆనంద లీల

చరణం::2

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనంద లాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనంద లీల
వేలితో కొండను ఎత్తే కొండత వేలు పట్టే ఆనంద లాల
తులసీ దళానికే తేలిపోయి తూగునట్టే ఆనంద లీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల

No comments: