Wednesday, May 25, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట         
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::1

అహ పైసా చిమ్మాలన్నా..ఐసా పైసా తేల్చాలన్నా
అ ప్రాణం ఇవ్వాలన్నా..ఇచ్చిన ప్రాణం తీయాలన్న
అరె హా అన్నిటికీ తయారు..మన యెదుట వున్న హుజూరు 
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::2

జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి
పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి
పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
అరెహా ఇంత మంచి రసికుడు
ఇక ఈ జన్మకు దొరకడు 
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌
హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::3

అరెరె మైకంలో ఉన్నాడూ..ఏదో లోకంలో ఉన్నాడూ
తాపంలో ఉన్నాడూ..అందం తాగాలంటున్నాడూ
అరె హా పట్టించు మందు..ఆపైన ఉంది విందు      
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట     

No comments: