Saturday, May 19, 2007

మన్మధ లీల--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు 
తారాగణం::కమల్‌హాసన్,జయప్రద,Y.విజయ,సునందిని,హలం,కుచలకుమారి 

పల్లవి::

మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

వింత మైకమున కొత్తవలపులే నేర్పిస్తుంది 
వింత మైకమున కొత్తవలపులే నేర్పిస్తుంది
ఎంతవారలను కాంతదాసులుగా మారుస్తుంది 
మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

చరణం::1


కొంటెగ చిన్నది నవ్వుతు వుంటే 
ఆగును ఊపిరి ఒక్క క్షణం..
ఆ..ఆ ఆహాఆ..జు జూ జూ..ఏహేహేహే..ఆహా 
కొంటెగ చిన్నది నవ్వుతు వుంటే 
ఆగును ఊపిరి ఒక్క క్షణం
ఆ ముద్దుల గుమ్మ ఎదురుగ వుంటే 
హద్దులు దాటును పడుచుదనం 
ఆ ముద్దుల గుమ్మ ఎదురుగ వుంటే 
హద్దులు దాటును పడుచుదనం 

చరణం::2

సృష్టికి మదనుడే మూలమట 
ప్రతి మనిషి వాడికి దాసుడట
సృష్టికి మదనుడే మూలమట 
ప్రతి మనిషివాడికి దాసుడట
వలపే తీయని వ్యసనమట 
అది పడచుదనానికి సహజమట   
వలపే తీయని వ్యసనమట 
అది పడచుదనానికి సహజమట   
మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

No comments: