Tuesday, May 29, 2007

బంగారు కలలు--1974



సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::కోసరాజు రాఘవయ్య 
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,లక్ష్మి,వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి.రంగారావు

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
బంగారు కలలే..కంటున్నారా
బంగారు కలలే..కంటున్నారా 

చరణం::1

పూల బాటగా భ్రమిసేరు..ముళ్ళబాట నడచేరూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పూల బాటగా భ్రమిసేరు..ముళ్ళబాట నడచేరూ
వలపుపొంగు వయసులోన..కన్ను మిన్ను కానలేరూ
హద్దుమీరి తిరిగేరంటే..అల్లరిపాలైపోతారూ  
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
బంగారు కలలే..కంటున్నారా  

చరణం::2

విరబూసిన పువ్వులాంటిదీ..అతివ జీవితం
మనసిచ్చిన భర్త దొరికితే..అదే మధురం జీవితం
పడరాని చేతిలో పడితే..అదే వెతల జీవితం..అదే వెలితి జీవితం
అంధకార బంధురం..కలతలున్న సంసారాలు..రాలిపోయి వాడిన పూలు     
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
బంగారు కలలే..కంటున్నారా  

చరణం::3

ప్రాణమున్న పువ్వులే..ఏఏఏ..పడుచుపిల్లలూ
అనురాగమే సుగంధం..త్యాగమే తియ్యని మకరందం
సొగసులే రంగులు..సోయగాలే ఆకర్షణలూ      
లోకం పోకడ తెలియకపోతే..మోజుల్లోపడి ముందుకు పోతే
బ్రతుకు భారమైపోతుందీ..చివరకు కన్నీరే మిగులుతుంది   
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
బంగారు కలలే..కంటున్నారా..ఆ ఆ ఆ
సింగారం చిందులు వేసే..అమ్మాయిల్లారా
బంగారు కలలే..కంటున్నారా..ఆ ఆ ఆ 

No comments: