Sunday, January 09, 2011

సంసారం సాగరం--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ. 

పల్లవి::

దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::1

చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
నలుగురూ కిలకిల..నవ్వినపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు 

చరణం::2

తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
ఒకటిగా కలిసి మెలిసి ఉన్నపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ 
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::3

అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
పరువుగా ఆ పిల్లలు బ్రతికినపుడె పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ తిన్నపుడె పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు

No comments: