Friday, December 02, 2011

దత్తపుత్రుడు--1972


సంగీత::T.చలపతిరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,వెన్నీరాడై నిర్మల,రమాప్రభ.

పల్లవి::

రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా
నీ వల్ల ఈ పల్లె..వెలుగొందునమ్మా
రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా

చరణం::1

అన్నపూర్ణయే...నీ కన్నతల్లి
ఆమె చల్లని మనసే..కల్పవల్లీ
అన్నపూర్ణయే...నీ కన్నతల్లి
ఆమె చల్లని మనసే..కల్పవల్లీ
కష్టించి పనిచేసే..నీ అన్న దీక్ష
కలకాలం నీ పాలిటి..శ్రీరామరక్ష
శ్రీరామరక్ష..ఆ

రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా
నీ వల్ల ఈ పల్లె..వెలుగొందునమ్మా
రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా 

చరణం::2

నీవు పుట్టిన యిల్లు..నిత్యకళ్యాణమై
నీవు మెట్టిన యిల్లు..పచ్చతోరణమై
నీవు పుట్టిన యిల్లు..నిత్యకళ్యాణమై
నీవు మెట్టిన యిల్లు..పచ్చతోరణమై
గృహలక్ష్మివి నీవై..మహలక్ష్మివి నీవై
గృహలక్ష్మివి నీవై..మహలక్ష్మివి నీవై
నీ అన్న కలలన్నీ..పండించవమ్మా
పండించవమ్మా..ఆ

రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా
నీ వల్ల ఈ పల్లె..వెలుగొందునమ్మా
రావమ్మ రావమ్మ..రతనాల బొమ్మా

No comments: