Saturday, November 24, 2012

మూగప్రేమ--1971





సంగీతం::చక్రవర్తి
రచన::C.V.రమణ
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,G. వరలక్ష్మి

పల్లవి::

నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా 
   
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా    

చరణం::1
    
గూటిలోన దీపమెట్టి..ఏడినీళ్ళ తానమాడి
గూటిలోన దీపమెట్టి..ఏడినీళ్ళ తానమాడి
బంతి పూలెట్టుకొని..నీ కోసం సూత్తంటె
బంతి పూలెట్టుకొని..నీ కోసం సూత్తంటె
చందమామ వచ్చాడు..కన్నుగీటిపోయాడు 
చందమామ వచ్చాడు..కన్నుగీటిపోయాడు
అప్పుడు మామ..మ్మ్ హూ..
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా    

చరణం::2

నల్లమబ్బు మొలిసింది..పల్లెమీద ముసిరింది
నల్లమబ్బు మొలిసింది..పల్లెమీద ముసిరింది
జల్లు కురవబోతంటే..ఒళ్లు మరసి నేనుంటే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
జల్లు కురవబోతంటే..ఒళ్లు మరసి నేనుంటే
మబ్బులోని మెరుపొచ్చి..బుగ్గగిల్లిపోయింది    
మబ్బులోని మెరుపొచ్చి..బుగ్గగిల్లిపోయింది
అప్పుడు మామ..హ్హా..
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా 
   
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ ఒళ్ళు ఝల్లుమన్నాదిరా

No comments: