Saturday, November 24, 2012

మట్టిలో మాణిక్యం--1971

























సంగీతం::సత్యం
ప్రొడ్యుసర్::చలం 
Director:దర్శకత్వం::బి.వి.ప్రసాద్ 
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::P.భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం
గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ

పల్లవి::

హే..ఎద్దుబండి చూడు..ఒంటెద్దుబండి చూడు
అహ ఎద్దు మొద్దు అవతారం..బండి తోలుతున్నాడు
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..అహ..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో 
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..అహ..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ..ఉన్నాడు డియ్యాలో 

లా లల లల లలలల ఆహా హా లా లల లల లలలలలా 
తుర్రు బుర్రు కారు..ఇది డబ్బా రేకు కారూ
టైరు పగిలిపోయిందా..కారు పని గోవిందా
బస్తీ దొరసానులూ డియ్యాలో..ఒహొ డియ్యాలో
బుట్టబొమ్మల్లా ఉన్నారు..డియ్యాలో 

చరణం::1

రివ్వు రివ్వున సాగే..గువ్వలాంటి కారూ
ఎంత దూరమైనా..ఇది చిటికెలోన చేరూ
రివ్వు రివ్వున సాగే..గువ్వలాంటి కారూ
ఎంత దూరమైనా..ఇది చిటికెలోన చేరూ
అహ..ఎవ్వరాపలేరూ..ఇది ఇంగిలీషు కారు
మా కారుముందు నీ బండి..బలాదూర్..బలాదూర్
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..ఒహో..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో 

చరణం::2

పరుగెత్తే వరకే..కారు జోరు చెల్లు
కుంటు పడిందంటే..ఇనప కొట్టు కెళ్ళు 
పరుగెత్తే వరకే..ఈ కారు జోరు చెల్లు
కుంటు పడిందంటే..అది ఇనపకొట్టు కెళ్ళు 
మీ ఓటు కారు కంటే..మా నాటు బండి మేలు
ఏ గట్టు పుట్టలడ్డున్నా..నెట్టుకుంటు పోతుందీ
బస్తీ దొరసానులూ డియ్యాలో..ఒహొ డియ్యాలో
బుట్టబొమ్మల్లా ఉన్నారు..డియ్యాలో

పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..ఒహో..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో 
లా లల లల లలల లా హా లా లా లల లల లలల లా లా
లా లల లల లలలల ఆహా హా లా లల లల లలలలలా 

No comments: